EVUSAM TV
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 8:16 am Posted by : EVUSAM TV

ఎల్‌నినో కరువు పరిస్థితుల్లో పంటల సాగుపై రైతులకు శిక్షణ

ఎవుసం టీవీ, రేగొండ: ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితుల్లో పంటల సాగు, సమీకృత పంటల సాగు, ప్రస్తుత పంటల్లో చేపట్టాల్సిన ఆచరణాత్మక పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో గల రైతువేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) బీటీవీ భూపాలపల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, భూపాలపల్లి శాస్త్రవేత్త డాక్టర్‌ కె. మదన్‌ మోహన్‌రెడ్డి హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం సాగులో ఉన్న వరి పంటలో కాండం తొలుచు పురుగు నివారణకు ఎకరానికి 8 నుంచి 10 కిలోల కార్బోఫ్యూరాన్‌ 3జీ గుళికలను ఇసుకలో కలిపి చల్లుకోవాలని సూచించారు.అలాగే పత్తి పంటలో రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ నివారణకు ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.3 మిల్లీలీటర్లను ఒక లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని వివరించారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏడీఏ ఎన్. రమేష్‌,మండల వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు గోవర్ధన్‌, ప్రవీణ్‌, భరత్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు

.