EVUSAM TV
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 11:13 am Posted by : EVUSAM TV

వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు రెండు రోజులు సెలవు

ఎవుసం టీవీ, వరంగల్ (ఏనుమాముల సర్కిల్): వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి రెండు రోజులు సెలవు ప్రకటించినట్లు వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పులి ప్రియాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.అమావాస్య సందర్భంగా అక్టోబర్ 10న శనివారం మార్కెట్ బంద్, అక్టోబర్ 11న ఆదివారం వారాంతపు సెలవు కారణంగా వరుసగా రెండు రోజులు మార్కెట్ కు సెలవు ఉంటుందని పేర్కొన్నారు. తిరిగి అక్టోబర్ 12న సోమవారం నుండి మార్కెట్ యథావిధిగా పున:ప్రారంభమవుతుందని తెలిపారు.రైతులు, వ్యాపారస్తులు, గుమాస్తాలు, హమాలీలు ఈ విషయాన్ని గమనించి సెలవు రోజుల్లో సరుకులను మార్కెట్ కు తీసుకురావద్దని, మార్కెట్ కమిటీకి సహకరించాలని కోరారు.