EVUSAM TV
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 2:02 pm Posted by : EVUSAM TV

జమ్మికుంట కేవీకేలో ఘనంగా మహిళా రైతు దినోత్సవ వేడుకలు

 

ఎవుసం టీవీ, జమ్మికుంట: గ్రామ నవ నిర్మాణ్ సమితి ఆధ్వర్యంలోని కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో మహిళా రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో మహిళా రైతుల పాత్ర కీలకమని, వ్యవసాయ ఉత్పత్తి పెంపుదలతో పాటు కుటుంబాల ఆర్థికాభివృద్ధిలో మహిళలు ముఖ్య భూమిక పోషిస్తున్నారని అన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా మహిళా రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త & హెడ్ డా.ఎన్.వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. సేంద్రీయ వ్యవసాయ విధానాలు, రానున్న రబీ సీజన్ లో సాగు చేయాల్సిన పంటలపై మహిళా రైతులకు పలు సూచనలు చేశారు.అనంతరం కేవీకే శాస్త్రవేత్తలు మహిళా రైతులకు వివిధ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలతో పాటు జమ్మికుంట,వీణవంక, హుజూరాబాద్ మండలాలకు చెందిన 116 మంది మహిళా రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.