EVUSAM TV
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 1:50 pm Posted by : EVUSAM TV

నవంబర్ 2న వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో పంట ధరల వివరాలు

ఎవుసం టీవీ,ఏనుమాముల మార్కెట్ సర్కిల్: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు వరంగల్ లో సోమవారం (నవంబర్ 2,2026) నాడు అన్ని పంటలకు ధరలు స్థిరంగా నమోదయ్యాయి. మార్కెట్ కు సంబంధించిన పంటల ధరల వివరాల్లో భాగంగా పత్తి (కొత్త) కు గరిష్టంగా రూ.8800, కనిష్టంగా రూ.7600, సగటు ధర రూ.8600, మొక్కజొన్నకు సగటున రూ.3230, తెల్ల జొన్నకు గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.2711, కందులకు గరిష్టంగా రూ.9155, కనిష్టంగా రూ.8712, సగటు రూ.8934, పెసర్లకు గరిష్టంగా రూ.6565, కనిష్టంగా రూ.3055, సగటు రూ.4810,సోయా బీన్స్ (తెల్లటివి) గరిష్టంగా రూ.7082, కనిష్టంగా రూ.6475, సగటు రూ.6779, తెల్ల నువ్వులకు గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.11425,శనగలకు గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.7152, ధనియాలకు గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.15355, వేరుశనగ (ఎండినవి) గరిష్టంగా రూ.8800, కనిష్టంగా రూ.7990, సగటు రూ.6000,వేరుశనగ (పచ్చివి) గరిష్టంగా రూ.4800, కనిష్టంగా రూ.3950, సగటు రూ.4600, పసుపు కాడి, గోలా రకాలకు గరిష్టంగా రూ.18589, కనిష్టంగా రూ.18539 నుంచి 18579, సగటు రూ.18589 గా ఉంది.మిర్చిలో తేజ ఏ/సి కి గరిష్టంగా రూ.22500, కనిష్టంగా రూ.16500, సగటు రూ.20500, వండర్ హాట్ కి గరిష్టంగా రూ.32800, కనిష్టంగా రూ.17000, సగటు రూ.28500, 341 ఏ/సి కి గరిష్టంగా రూ.26500, కనిష్టంగా రూ.16000, సగటు రూ.22500 గా నమోదైంది.