EVUSAM TV
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 9:56 pm Posted by : EVUSAM TV

రసాయనాలు తగ్గించి,భూసారాన్ని కాపాడుకోవాలి : ఏఈఓ ప్రవళిక

ఎవుసం టీవీ, ఆత్మకూర్ (హన్మకొండ) : నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, రసాయన ఎరువుల మోతాదును తగ్గించి దీర్ఘకాలిక స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారానే రైతులు భవిష్యత్తులో లాభాలు సాధించగలరని ఆత్మకూరు మండలం పెద్దాపూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవళిక స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశవ్యాప్త ‘ఖేత్ బచావో అభియాన్’ ప్రచారంలో భాగంగా గురువారం అగ్రంపహాడ్ గ్రామంలో ప్రత్యేక రైతు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవళిక మాట్లాడుతూ.. “సేవ్ ద సాయిల్, సేవ్ ఫార్మింగ్, సేవ్ ఫార్మర్స్” అనే ప్రధాన నినాదంతో భూసార పరిరక్షణ ప్రాముఖ్యతను రైతులకు వివరించారు.భూసార పరీక్షల ఆధారంగానే ఎరువులు వేయాలని, పచ్చిరొట్ట మరియు జీవ ఎరువులతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. భూగర్భ జలాల పరిరక్షణకు చిరుధాన్యాల సాగును ఎంచుకోవాలని, మార్కెట్‌లో లభించే నకిలీ విత్తనాలు, ఎరువుల పట్ల రైతులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాకుండా పీఎం-కిసాన్, పంటల బీమా, కిసాన్ క్రెడిట్ కార్డ్ వంటి సంక్షేమ పథకాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.