రైతులను నూనెగింజల సాగు వైపు ప్రోత్సహిస్తున్న వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఎవుసం టీవీ, తోర్నాల: పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తూ రైతులు ప్రత్యామ్నాయ లాభదాయక పంటల సాగు చేపట్టేలా వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల ఆధ్వర్యంలో ‘రైతు పొలాల్లోకి ఆవిష్కరణలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నూనెగింజ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రొద్దుతిరుగుడు KBSH-90 హైబ్రిడ్ విత్తనాలను పంపిణీ చేశారు.బుస్సాపూర్, రావురూకుల, పెద్దమాసాన్‌పల్లి గ్రామాలకు చెందిన 60 మంది రైతులకు ఒక్కొక్కరికి 2 కిలోల ప్యాకెట్ చొప్పున ప్రొద్దుతిరుగుడు KBSH-90 హైబ్రిడ్ విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన స్థానం, తోర్నాల శాస్త్రవేత్త మరియు అధిపతి డా. జి. సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు వరి వంటి సాంప్రదాయ పంటలపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ లాభదాయక పంటగా ప్రొద్దుతిరుగుడు సాగు చేపట్టాలని సూచించారు. వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అభివృద్ధి చేసిన ఆధునిక సాగు సాంకేతికతలను రైతుల పొలాల్లో ప్రత్యక్షంగా ప్రదర్శించి, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టేలా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంపొందించడం, దేశీయ నూనెగింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయానికి తోడ్పడటం ఈ కార్యక్రమ లక్ష్యాలని వివరించారు. అనంతరం ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త నీలిమ మాట్లాడుతూ.. ప్రొద్దుతిరుగుడు పంటలో అందుబాటులో ఉన్న వివిధ హైబ్రిడ్ రకాలు, వాటి ప్రత్యేక గుణగణాలు, సాగులో వాటి ప్రాధాన్యత గురించి వివరించారు. సేద్య విభాగ శాస్త్రవేత్త డా. శ్వేత మాట్లాడుతూ.. ప్రొద్దుతిరుగుడు సాగులో పాటించాల్సిన మెలకువలను వివరించారు. సరైన విత్తన మోతాదు, సకాలంలో విత్తడం, మొక్కల మధ్య తగిన దూరం పాటించడం, సమతుల్య ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, కలుపు నివారణ వంటి అంశాలపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందించారు. కీటక శాస్త్రవేత్త డా. రమాదేవి మాట్లాడుతూ.. యాసంగి పంటల్లో ఆశించే వివిధ రకాల చీడపీడలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి వివరించారు.అదేవిధంగా ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త సరిత మాట్లాడుతూ మొక్కజొన్న, పప్పుదినుసుల సాగు విధానాలు, అందుబాటులో ఉన్న వివిధ రకాలు, వాటి ప్రత్యేకతలపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల సర్పంచులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని, పంటల వైవిధ్యీకరణ ద్వారా వ్యవసాయంలో స్థిరమైన ఆదాయాన్ని పొందేందుకు కృషి చేయాలని వారు రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు..

నవంబర్ 6న వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో పంట ధరల వివరాలు

ఎవుసం టీవీ, ఏనుమాముల మార్కెట్ సర్కిల్: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు...

Related articles

నవంబర్ 6న వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో పంట ధరల వివరాలు

ఎవుసం టీవీ, ఏనుమాముల మార్కెట్ సర్కిల్: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు వరంగల్ లో శుక్రవారం (06-11-2026) రోజున మార్కెట్ కు సంబంధించిన పంటల...

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ASCI ప్రతినిధులు.. రైతు మురళీధర్ సాగు విధానాలపై అధ్యయనం

    ఎవుసం టీవీ, ఎల్కతుర్తి: ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, సుస్థిర సాగు విధానాలపై క్షేత్రస్థాయి అవగాహన పొందేందుకు హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా...

రసాయనాలు తగ్గించి,భూసారాన్ని కాపాడుకోవాలి : ఏఈఓ ప్రవళిక

ఎవుసం టీవీ, ఆత్మకూర్ (హన్మకొండ) : నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, రసాయన ఎరువుల మోతాదును తగ్గించి దీర్ఘకాలిక స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారానే...

ఎల్‌నినో పరిస్థితుల్లో ఉద్యాన పంటల యాజమాన్యంపై రైతులకు శిక్షణ

ఎవుసం టీవీ, ఆత్మకూరు(హన్మకొండ): ఎల్‌నినో ప్రభావంతో రాబోయే కాలంలో వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు...
App Icon

Install ETV News App

Add to home screen for faster loading and latest updates.