రబీ సాగుపై రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సూచనలు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఎవుసం టీవీ, జమ్మికుంట: రబీ సీజన్‌లో రైతులు అనుసరించాల్సిన సాగు విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పలు సూచనలు చేశారు. కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), జమ్మికుంట ఆధ్వర్యంలో శనివారం కేంద్ర మంత్రి లైవ్ వెబ్‌కాస్ట్ కార్యక్రమాన్ని రైతులకు ప్రత్యక్ష ప్రసారం చేశారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు రైతులు, మహిళా రైతులు పాల్గొని కేంద్ర మంత్రి ప్రసంగాన్ని వీక్షించారు. రబీ సీజన్‌లో స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఎంపిక చేసుకోవాలని మంత్రి సూచించారు. విత్తనశుద్ధి తప్పనిసరిగా చేపట్టడంతో పాటు నేల పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం చేపట్టాలని తెలిపారు.అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంతో పాటు నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు.కార్యక్రమం అనంతరం రైతులు అడిగిన పలు వ్యవసాయ సంబంధిత సందేహాలకు కేవీకే శాస్త్రవేత్తలు సమాధానాలు అందించారు. కార్యక్రమంలో కేవీకే ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్, విషయ నిపుణులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు

.

వరి విత్తనోత్పత్తిలో మెళకువలు పాటించాలి శాస్త్రవేత్తలు మదన్ మోహన్ రెడ్డి, గోన్యా నాయక్

ఎవుసం టీవీ, రేగొండ: నాణ్యమైన విత్తనోత్పత్తి ద్వారానే అధిక దిగుబడులు సాధించవచ్చని...

Related articles

వరి విత్తనోత్పత్తిలో మెళకువలు పాటించాలి శాస్త్రవేత్తలు మదన్ మోహన్ రెడ్డి, గోన్యా నాయక్

ఎవుసం టీవీ, రేగొండ: నాణ్యమైన విత్తనోత్పత్తి ద్వారానే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం భూపాలపల్లి కోఆర్డినేటర్ డా. కె. మదన్...

సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ రంగంపై కీలక చర్చలు

ఎవుసం టీవీ, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, డిజిటల్ వ్యవసాయం తదితర అంశాలపై...

పంటల్లో తెగుళ్ల నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఎవుసం టీవీ, చింతలమానేపల్లి (కొమురంభీం ఆసిఫాబాద్):చింతలమానేపల్లి మండలంలోని డబ్బా, ఆదేపల్లి, బాబాసాగర్ గ్రామాల్లో TRVK, KVK శాస్త్రవేత్తల బృందం మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆయా...

రసాయనాలకు దూరంగా.. ప్రకృతి సాగు బాటలో రైతులు

కోసిని గ్రామంలో కృషి సఖీల క్షేత్ర సందర్శన ఎవుసం టీవీ, కాగజ్‌నగర్: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు ప్రకృతి సాగు పద్ధతులపై అవగాహన కల్పించే...
App Icon

Install ETV News App

Add to home screen for faster loading and latest updates.