పంటల్లో తెగుళ్ల నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Date:

Share post:

ఎవుసం టీవీ, చింతలమానేపల్లి (కొమురంభీం ఆసిఫాబాద్):చింతలమానేపల్లి మండలంలోని డబ్బా, ఆదేపల్లి, బాబాసాగర్ గ్రామాల్లో TRVK, KVK శాస్త్రవేత్తల బృందం మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆయా గ్రామాల్లో సాగు చేస్తున్న వరి, పత్తి పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. పంటల్లో కనిపిస్తున్న పురుగు, తెగుళ్ల లక్షణాలను గుర్తించి రైతులకు నివారణ చర్యలను వివరించారు.వరి పొలాల్లో కొన్ని చోట్ల ఆకుల చివర్లు ఎండిపోవడాన్ని గుర్తించారు. భూమిలో చౌడు సమస్య కారణంగా ఈ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. రైతులు మృత్తికా పరీక్షలు చేయించుకుని భూమి స్వభావాన్ని తెలుసుకోవాలని సూచించారు. చౌడు భూములను మెరుగుపరచేందుకు వేసవిలో జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేసి, తగిన దశలో వాటిని పొలంలోనే కలియదున్నాలని చెప్పారు.వరిలో బాక్టీరియల్ లీఫ్ బ్లైట్ (బాక్టీరియా ఆకు ఎండ తెగులు) లక్షణాలను కూడా గుర్తించారు. తెగులు ఉధృతి పెరగకుండా నత్రజని ఎరువులు, ముఖ్యంగా యూరియాను అధికంగా వినియోగించరాదని సూచించారు. సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వినియోగించాలని తెలిపారు. తెగులు ప్రారంభ దశలో కనిపించినప్పుడు కాపర్ ఆక్సీక్లోరైడ్ 50% WPను సిఫారసు చేసిన మోతాదులో పిచికారీ చేయాలని, తెగులు మచ్చలు విస్తరిస్తున్న సమయంలో స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్‌ను సిఫారసు చేసిన మోతాదులో వినియోగించాలని సూచించారు.వరిలో అంతర పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రతి నాలుగు వరుసల వరి తరువాత ఒక వరుస కందిని సాగు చేసేలా 4:1 నిష్పత్తిని పాటించాలని రైతులకు సూచించారు.పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేయడంతో పాటు పంటను తరచూ పరిశీలించాలని చెప్పారు. అవసరాన్ని బట్టి వేపనూనెను పిచికారీ చేయాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతలు, తేమ, వర్షాల కారణంగా పత్తిలో పూత రాలే అవకాశం ఉందని తెలిపారు. పూత రాలడం అధికంగా ఉన్నప్పుడు 10 లీటర్ల నీటికి 2 మి.లీ. ప్లానోఫిక్స్‌ను కలిపి పిచికారీ చేయాలని సూచించారు.పత్తిలో రసాన్ని పీల్చే పురుగుల నియంత్రణకు అవసరాన్ని బట్టి వేపనూనె, ఫ్లోనికామిడ్ లేదా ఇమిడాక్లోప్రిడ్‌ను సిఫారసు చేసిన మోతాదులోనే వినియోగించాలని తెలిపారు. సస్యరక్షణ మందులను విచక్షణారహితంగా వినియోగించకుండా శాస్త్రవేత్తలు సూచించిన మోతాదులో మాత్రమే ఉపయోగించాలని సూచించారు.రైతులు పంటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ పురుగు, తెగుళ్ల లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించాలని శాస్త్రవేత్తలు తెలిపారు. సమస్యలను గుర్తించిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలను సంప్రదించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ క్షేత్ర సందర్శనలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కోఆర్డినేటర్ డా. ఎం. మధు, కేవీకే బెల్లంపల్లి సీనియర్ సైంటిస్ట్ డా. ఎన్. మహేష్, శాస్త్రవేత్త డా. పి. సాధ్వి, చింతలమానేపల్లి మండల వ్యవసాయ అధికారి కె. కార్తీషా, వ్యవసాయ విస్తరణ అధికారులు బి. సిద్ధార్థ, ఆర్. మీనా తదితరులు పాల్గొన్నారు.

 

సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ రంగంపై కీలక చర్చలు

ఎవుసం టీవీ, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల...

Related articles

సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ రంగంపై కీలక చర్చలు

ఎవుసం టీవీ, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, డిజిటల్ వ్యవసాయం తదితర అంశాలపై...

రబీ సాగుపై రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సూచనలు

ఎవుసం టీవీ, జమ్మికుంట: రబీ సీజన్‌లో రైతులు అనుసరించాల్సిన సాగు విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్...

రసాయనాలకు దూరంగా.. ప్రకృతి సాగు బాటలో రైతులు

కోసిని గ్రామంలో కృషి సఖీల క్షేత్ర సందర్శన ఎవుసం టీవీ, కాగజ్‌నగర్: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు ప్రకృతి సాగు పద్ధతులపై అవగాహన కల్పించే...

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం

ఎవుసం టీవీ, రేగొండ: ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకునే మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేయాలని...
App Icon

Install ETV News App

Add to home screen for faster loading and latest updates.