రైతన్న చేతిలోకి RAISE యాప్ అస్త్రం.. ఫొటో తీస్తే చీడపీడల సమస్యకు పరిష్కారం!

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఎవుసం టీవీ జమ్మికుంట: ఆధునిక వరి సాగులో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు అందుబాటులోకి వచ్చిన రైస్ ఏఐ స్ట్రెస్ ఎవాల్యుయేటర్ (RAISE) యాప్ పై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు.భారతీయ వరి పరిశోధనా సంస్థ (IIRR), హైదరాబాద్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం (KVK) జమ్మికుంట సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లోని రెండు గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతుల సెల్ ఫోన్లలో నేరుగా యాప్ ను ఇన్ స్టాల్ చేసి వినియోగంపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు.ఈ యాప్ ద్వారా రైతులు వరి పొలంలో కనిపించే తెగుళ్లు, చీడపీడల సమస్యలను ఫోటో తీసి అప్ లోడ్ చేస్తే, కృత్రిమ మేధస్సు ఆధారంగా తక్షణమే సమస్యను గుర్తించి, పరిష్కార మార్గాలను సూచిస్తుందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త డా. బి. శైలజ మాట్లాడుతూ.. రైతులు ఈ సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని, మట్టి పరీక్షల ఆధారంగానే రసాయన ఎరువులు వాడాలని సూచించారు. అనంతరం ప్రధాన శాస్త్రవేత్త డా. కృష్ణవేణి మాట్లాడుతూ… వరి పంటలో తలెత్తే సమస్యలకు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులపై వివరించారు. అదేవిధంగా కేవీకే శాస్త్రవేత్త డా. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. యాప్ ను ఉపయోగించి చీడపీడల నిర్ధారణ, సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కేవీకే సీనియర్ సైంటిస్ట్ డా. ఎన్. వెంకటేశ్వరరావు, ఎస్.ఆర్.టీ కోఆర్డినేటర్ జి. అశోక్, ఏటీఎంఏ చైర్మన్ వంగల వెంకట్ రెడ్డి, శాస్త్రవేత్తలు మహేష్, ప్రశాంతి, వేణుగోపాల్, సేంద్రియ వ్యవసాయ ప్రాజెక్ట్ సిబ్బంది, బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులతో పాటు రైతులు పాల్గొన్నారు.

వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు రెండు రోజులు సెలవు

ఎవుసం టీవీ, వరంగల్ (ఏనుమాముల సర్కిల్): వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి...

Related articles

వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు రెండు రోజులు సెలవు

ఎవుసం టీవీ, వరంగల్ (ఏనుమాముల సర్కిల్): వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి రెండు రోజులు సెలవు ప్రకటించినట్లు వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పులి...

పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తలు తప్పనిసరి : ఏఈఓ చిలువేరి ప్రవీణ్

ఎవుసం టీవీ,చందుర్తి: పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని చందుర్తి మండలం,మూడపల్లి క్లస్టర్ ఏఈఓ చిలువేరి ప్రవీణ్...

విత్తనోత్పత్తితో రైతులకు అదనపు లాభాలు : తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా. ఎం. మధు

      ఎవుసం టీవీ, కొమురం భీం ఆసిఫాబాద్: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు సాధ్యమని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా. ఎం. మధు...

ప్రకృతి వ్యవసాయంపై కృషి సఖీలకు 5 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభం

ఎవుసం టీవీ, జయశంకర్ భూపాలపల్లి: జాతీయ సమగ్ర ప్రకృతి వ్యవసాయ పథకం (NMNF - National Mission on Natural Farming) ఆధ్వర్యంలో కృషి...
App Icon

Install ETV News App

Add to home screen for faster loading and latest updates.