వెలుగులోకి పూర్వకాలపు బంగారు పెసర్లు

Date:

Share post:

ఎవుసం టీవీ, అసిఫాబాద్: కొమురంభీం అసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పర్దా గ్రామ పరిధిలో అరుదైన, పూర్వకాలపు పెసర రకం వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త (అగ్రానమి), కోఆర్డినేటర్ డా. ఎం. మధు గ్రామంలో పర్యటించిన సందర్భంగా పసుపు రంగు గింజలను ఉత్పత్తి చేసే అడవి, ప్రాచీన పెసర రకాన్ని గుర్తించారు.వృక్షశాస్త్రపరంగా విగ్నా రేడియేటా (Vigna radiata)కు చెందిన ఈ రకాన్ని చారిత్రకంగా ‘గోల్డెన్ గ్రామ్’ (బంగారు పెసర్లు)గా పేర్కొంటారని డా. మధు తెలిపారు. ప్రస్తుతం వాణిజ్యపరంగా విస్తృతంగా సాగు చేస్తున్న పెసర రకాలు ప్రధానంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయని, అయితే కొండలు, గుట్టల ప్రాంతాల్లోని గిరిజన సమాజాల్లో సంప్రదాయంగా సాగు చేస్తున్న కొన్ని స్థానిక రకాల్లో భిన్నమైన వర్ణ వైవిధ్యం కనిపిస్తుందని పేర్కొన్నారు.ఆకుపచ్చ పెసరతో పాటు పసుపు, నలుపు రంగు గింజలు కలిగిన పెసర రకాలు కూడా కొన్ని ప్రాంతాల్లో అరుదుగా సాగులో ఉన్నాయని తెలిపారు. ఇవి కేవలం సంప్రదాయ పంటలుగా కాకుండా, పంటల్లో జన్యు వైవిధ్యానికి విలువైన వనరులుగా ఉపయోగపడే అవకాశం ఉందన్నారు.ఇలాంటి పురాతన, స్థానిక పంట రకాలను గుర్తించి సంరక్షించడం ద్వారా భవిష్యత్‌లో చేపట్టే వివిధ పంటల అభివృద్ధి, బ్రీడింగ్ కార్యక్రమాలకు ఉపయోగపడే లక్షణాలను వెలికితీయవచ్చని డా. మధు వివరించారు. సంప్రదాయ విత్తన సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.పసుపు రంగులో ఉండే పెసర్లను స్థానికంగా ‘బాలింత పెసర్లు’ అని కూడా పిలుస్తారని,ప్రసవం అనంతరం బాలింతలు వీటిని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారని, వీటిని తినడం వల్ల తల్లుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుందని స్థానిక ప్రజలు చెప్పడం జరిగిందని వివరించారు..

సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ రంగంపై కీలక చర్చలు

ఎవుసం టీవీ, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల...

Related articles

సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ రంగంపై కీలక చర్చలు

ఎవుసం టీవీ, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, డిజిటల్ వ్యవసాయం తదితర అంశాలపై...

పంటల్లో తెగుళ్ల నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఎవుసం టీవీ, చింతలమానేపల్లి (కొమురంభీం ఆసిఫాబాద్):చింతలమానేపల్లి మండలంలోని డబ్బా, ఆదేపల్లి, బాబాసాగర్ గ్రామాల్లో TRVK, KVK శాస్త్రవేత్తల బృందం మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆయా...

రబీ సాగుపై రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సూచనలు

ఎవుసం టీవీ, జమ్మికుంట: రబీ సీజన్‌లో రైతులు అనుసరించాల్సిన సాగు విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్...

రసాయనాలకు దూరంగా.. ప్రకృతి సాగు బాటలో రైతులు

కోసిని గ్రామంలో కృషి సఖీల క్షేత్ర సందర్శన ఎవుసం టీవీ, కాగజ్‌నగర్: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు ప్రకృతి సాగు పద్ధతులపై అవగాహన కల్పించే...
App Icon

Install ETV News App

Add to home screen for faster loading and latest updates.