వరి విత్తనోత్పత్తిలో మెళకువలు పాటించాలి శాస్త్రవేత్తలు మదన్ మోహన్ రెడ్డి, గోన్యా నాయక్

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఎవుసం టీవీ, రేగొండ: నాణ్యమైన విత్తనోత్పత్తి ద్వారానే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం భూపాలపల్లి కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి,వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వృక్ష ప్రజనన శాస్త్రవేత్త డా. పి. గోన్యా నాయక్ అన్నారు.గురువారం రేగొండ రైతు వేదిక వరిలో విత్తనోత్పత్తిపై RPL (రికగ్నిషన్ ప్రేయర్ లెర్నింగ్) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డా. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సుస్థిర వ్యవసాయ, ఆహార వ్యవస్థల కోసం నాబార్డు ఆర్థిక సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా PACS, రేగొండ ద్వారా వరి రకం KNM 1638 విత్తనోత్పత్తిని ప్రోత్సహిస్తున్నామన్నారు. రైతులు విత్తన నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.అనంతరం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్ వృక్ష ప్రజనన శాస్త్రవేత్త డా. పి. గోన్యా నాయక్ మాట్లాడుతూ.. విత్తనోత్పత్తికి నాణ్యమైన, ధృవీకరించబడిన మూల విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలన్నారు. కల్తీ జరగకుండా తగిన దూరం పాటించాలని, పుష్పించే దశలో, కోతకు ముందు రోగింగ్ నిర్వహించి జన్యు స్వచ్ఛతను కాపాడుకోవాలన్నారు. కాండం తొలుచు పురుగు, ఆకు ముడత పురుగు యాజమాన్యంపై అప్రమత్తంగా ఉండాలని, కోత అనంతరం తేమ శాతం తగ్గించి శాస్త్రీయంగా నిల్వ చేయాలని తెలిపారు.జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ వల్యా నాయక్ మాట్లాడుతూ PACS లను విత్తనోత్పత్తికి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.జిల్లా వ్యవసాయ అధికారి బాపు రావు మాట్లాడుతూ.. విత్తన ధృవీకరణ సంస్థ నిబంధనలు పాటిస్తూ విత్తనోత్పత్తి చేపడితే రైతులకు అదనపు ఆదాయంతో పాటు స్థానికంగా నాణ్యమైన విత్తనాల లభ్యత పెరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వాసుదేవ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు గోవర్ధన్, భరత్, ప్రవళిక, పీఏసీఎస్ సీఈవో జగన్, రైతులు పాల్గొన్నారు.

సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ రంగంపై కీలక చర్చలు

ఎవుసం టీవీ, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల...

Related articles

సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ రంగంపై కీలక చర్చలు

ఎవుసం టీవీ, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, డిజిటల్ వ్యవసాయం తదితర అంశాలపై...

పంటల్లో తెగుళ్ల నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఎవుసం టీవీ, చింతలమానేపల్లి (కొమురంభీం ఆసిఫాబాద్):చింతలమానేపల్లి మండలంలోని డబ్బా, ఆదేపల్లి, బాబాసాగర్ గ్రామాల్లో TRVK, KVK శాస్త్రవేత్తల బృందం మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆయా...

రబీ సాగుపై రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సూచనలు

ఎవుసం టీవీ, జమ్మికుంట: రబీ సీజన్‌లో రైతులు అనుసరించాల్సిన సాగు విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్...

రసాయనాలకు దూరంగా.. ప్రకృతి సాగు బాటలో రైతులు

కోసిని గ్రామంలో కృషి సఖీల క్షేత్ర సందర్శన ఎవుసం టీవీ, కాగజ్‌నగర్: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు ప్రకృతి సాగు పద్ధతులపై అవగాహన కల్పించే...
App Icon

Install ETV News App

Add to home screen for faster loading and latest updates.