విత్తనోత్పత్తితో రైతులకు అదనపు లాభాలు : తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా. ఎం. మధు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

 

 

ఎవుసం టీవీ, కొమురం భీం ఆసిఫాబాద్: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు సాధ్యమని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా. ఎం. మధు అన్నారు. కెరమెరి, వాంకిడి మరియు ఆసిఫాబాద్ మండలాల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఆధ్వర్యంలో, నాబార్డ్ (NABARD) ఆర్థిక సహకారంతో, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, ఆసిఫాబాద్ సమన్వయంతో రైతులకు కంది విత్తనోత్పత్తిపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కెరమెరి ప్యాక్స్ డైరెక్టర్ షేక్ మహమ్మద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డా. ఎం. మధు మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనం కోసం పాటించాల్సిన వేర్పాటు దూరం (Isolation Distance), పంటలో ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవడం మరియు కల్తీల ఏరివేత (Roguing) వంటి సాంకేతిక అంశాలను రైతులకు తెలియజేశారు. అలాగే పంటలో వచ్చే మరూక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు,తెగుళ్లు మరియు వాటి నివారణ, పంట కోతకు సంబంధించిన అంశాలను వివరంగా వివరించారు. నాబార్డ్ సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతోందన్నారు. అనంతరం కెరమెరి ప్యాక్స్ డైరెక్టర్ షేక్ మహమ్మద్ మాట్లాడుతూ.. రైతులు స్వయంగా నాణ్యమైన విత్తనోత్పత్తి చేపట్టడం ద్వారా సాగు ఖర్చులు తగ్గుతాయని, “రైతు నుంచి రైతుకే విత్తనం” అనే విధానంతో ప్రతి ఒక్కరికీ తక్కువ ఖర్చులోనే మేలైన విత్తనం అందుబాటులోకి వస్తుందని పేర్కొంటూ ఇలాంటి కార్యక్రమాలకు సహకరించిన నాబార్డ్ మరియు వ్యవసాయ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అభ్యుదయ రైతు బాలాజీ మాట్లాడుతూ.. కంది పంట తక్కువ ఖర్చుతో ఎక్కువ నికర ఆదాయాన్ని తెచ్చే పంట అని, వచ్చే సంవత్సరం ఎక్కువ మంది రైతులు దీనిలో భాగస్వాములై విత్తనోత్పత్తి చేయడానికి ముందుకు రావాలని కోరారు. ధనోరా గ్రామ సర్పంచ్ సిడాం గంగు మాట్లాడుతూ శాస్త్రవేత్త మధు గారు చెప్పిన సలహాలు, సూచనలను కంది విత్తనోత్పత్తి చేసే రైతులు తప్పకుండా పాటించి మంచి దిగుబడులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధనోరా వ్యవసాయ విస్తరణ అధికారి ప్రభావతి, ప్యాక్స్ సీఈఓలు రమణ, ఓమాజీ, విజయ్ తో పాటు 40 మంది రైతులు పాల్గొన్నారు.

వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు రెండు రోజులు సెలవు

ఎవుసం టీవీ, వరంగల్ (ఏనుమాముల సర్కిల్): వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి...

Related articles

వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు రెండు రోజులు సెలవు

ఎవుసం టీవీ, వరంగల్ (ఏనుమాముల సర్కిల్): వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి రెండు రోజులు సెలవు ప్రకటించినట్లు వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పులి...

రైతన్న చేతిలోకి RAISE యాప్ అస్త్రం.. ఫొటో తీస్తే చీడపీడల సమస్యకు పరిష్కారం!

ఎవుసం టీవీ జమ్మికుంట: ఆధునిక వరి సాగులో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు అందుబాటులోకి వచ్చిన రైస్ ఏఐ స్ట్రెస్...

పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తలు తప్పనిసరి : ఏఈఓ చిలువేరి ప్రవీణ్

ఎవుసం టీవీ,చందుర్తి: పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని చందుర్తి మండలం,మూడపల్లి క్లస్టర్ ఏఈఓ చిలువేరి ప్రవీణ్...

ప్రకృతి వ్యవసాయంపై కృషి సఖీలకు 5 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభం

ఎవుసం టీవీ, జయశంకర్ భూపాలపల్లి: జాతీయ సమగ్ర ప్రకృతి వ్యవసాయ పథకం (NMNF - National Mission on Natural Farming) ఆధ్వర్యంలో కృషి...
App Icon

Install ETV News App

Add to home screen for faster loading and latest updates.