రైతుల కోసం… ఎవుసం టీవీ మరో ముందడుగు

Date:

Share post:

రైతు బాగుంటేనే (ఎవుసం) వ్యవసాయం బాగుంటుంది… వ్యవసాయం (ఎవుసం) బాగుంటేనే మన సమాజం బాగుంటుంది. ఈ మాటను కేవలం ఒక నినాదంగా కాకుండా… ఒక బాధ్యతగా భావిస్తూ ఇన్నాళ్లుగా రైతుల గొంతుకగా, వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తున్న ఎవుసం TV, ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది.

రైతు పొలంలో అడుగు పెట్టినప్పటి నుంచి… పంట చేతికి వచ్చే వరకు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సవాళ్లు. ఏ పంట వేయాలి? ఏ విత్తనం ఎంచుకోవాలి? ఎరువులు ఎలా వాడాలి? చీడపీడలను ఎలా గుర్తించాలి? వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పండించిన పంటకు సరైన ధర ఎక్కడ లభిస్తుంది? ప్రభుత్వం అందించే పథకాలు రైతుకు ఎలా చేరాలి? ఇలాంటి ప్రతి ప్రశ్నకు సరైన సమయంలో సరైన సమాచారం అందడం… రైతుకు ఎంతో అవసరం.

అందుకే… రైతుల కోసం మరో అడుగు ముందుకు వేసి, ఎవుసం TV తన డిజిటల్ వేదికను మీ ముందుకు తీసుకొచ్చింది. ఇకపై టీవీ తెరపై మాత్రమే కాదు… మీ చేతిలోని మొబైల్‌లో, మీకు అవసరమైన సమయంలో, మీకు అవసరమైన వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉండేలా ఈ వేదికను తీర్చిదిద్దాం,ముందు ముందు ఇంకా తీర్చిదిద్దబోతున్నాం.

ఇది కేవలం వార్తలు చదివే వెబ్‌సైట్ కాదు. రైతు నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి చూసే నమ్మకమైన వ్యవసాయ సమాచార వేదికగా దీన్ని నిలబెట్టాలన్నదే మా ప్రయత్నం. పంటల సాగు విధానాల నుంచి చీడపీడల నివారణ వరకు… విత్తనాల నుంచి ఎరువుల వరకు… వాతావరణం నుంచి మార్కెట్ ధరల వరకు… ప్రభుత్వ పథకాల నుంచి నిపుణుల సూచనల వరకు… రైతుకు ఉపయోగపడే ప్రతి అంశాన్ని సులభమైన భాషలో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.

రైతన్నా… మీ పొలంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక మీ కుటుంబ భవిష్యత్తు ఉంటుంది. అందుకే మేము అందించే ప్రతి సమాచారం వెనుక కూడా ఒక బాధ్యత ఉంటుంది. వేగంగా చెప్పడం కంటే… నిజంగా ఉపయోగపడేలా చెప్పడం ముఖ్యం. సంచలనంగా చెప్పడం కంటే… విశ్వసనీయంగా చెప్పడం ముఖ్యం.

మీ సమస్య మా కథనం కావాలి… మీ సందేహానికి సమాధానం మా బాధ్యత కావాలి… మీ విజయగాథ మరొక రైతుకు స్ఫూర్తి కావాలి. రైతు ఎదుర్కొనే సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు… పరిష్కార మార్గాలను కూడా అందించే వేదికగా ఎవుసం TV ముందుకు సాగుతుంది.

ఎందుకంటే మాకు వ్యవసాయం ఒక వార్త కాదు… ఒక జీవన విధానం. రైతు ఒక ప్రేక్షకుడు కాదు… మన ప్రయాణంలో భాగస్వామి.

ఇది ఒక కొత్త ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరింత విస్తృతమైన వ్యవసాయ సమాచారంతో… మరింత మంది నిపుణులతో… మరిన్ని రైతుల కథలతో… మరింత బాధ్యతతో మీ ముందుకు వస్తాం.

మీరంతా కుటుంబ సభ్యులుగా ఆశీర్వదించి,ఆదరిస్తారని కోరుకుంటున్నాం..

ఇట్లు
ఎవుసం TV యాజమాన్యం..

సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ రంగంపై కీలక చర్చలు

ఎవుసం టీవీ, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల...

Related articles

సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ రంగంపై కీలక చర్చలు

ఎవుసం టీవీ, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, డిజిటల్ వ్యవసాయం తదితర అంశాలపై...

పంటల్లో తెగుళ్ల నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఎవుసం టీవీ, చింతలమానేపల్లి (కొమురంభీం ఆసిఫాబాద్):చింతలమానేపల్లి మండలంలోని డబ్బా, ఆదేపల్లి, బాబాసాగర్ గ్రామాల్లో TRVK, KVK శాస్త్రవేత్తల బృందం మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆయా...

రబీ సాగుపై రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సూచనలు

ఎవుసం టీవీ, జమ్మికుంట: రబీ సీజన్‌లో రైతులు అనుసరించాల్సిన సాగు విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్...

రసాయనాలకు దూరంగా.. ప్రకృతి సాగు బాటలో రైతులు

కోసిని గ్రామంలో కృషి సఖీల క్షేత్ర సందర్శన ఎవుసం టీవీ, కాగజ్‌నగర్: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు ప్రకృతి సాగు పద్ధతులపై అవగాహన కల్పించే...
App Icon

Install ETV News App

Add to home screen for faster loading and latest updates.