వాతావరణ మార్పులపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఎవుసం టీవీ,జఫర్గడ్ (జనగామ): వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని పరిస్థితుల్లో సంప్రదాయ సాగు విధానాలపై ఆధారపడటం రైతులకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా పంటల యాజమాన్యాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు.జనగామ జిల్లాలో పంటల పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వి. రమ్య,వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ పి. గోన్యనాయక్‌ శనివారం క్షేత్ర పర్యటన చేపట్టారు. జఫర్‌గడ్‌,స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలాల పరిధిలోని తీగారం,సూరారం,చాగల్లు, రాఘవపూర్‌ గ్రామాల్లో పర్యటించి వివిధ పంటలను పరిశీలించారు.వరి,పత్తి,మొక్కజొన్న,వేరుశనగ, నువ్వులు,కందులు, కూరగాయల పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. పంటల ప్రస్తుత దశ,సాగు విధానం,రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలోనే రైతులతో చర్చించి, ఆయా పంటలకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలను వివరించారు.వాతావరణ మార్పులు పంటలపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని,వ్యవసాయ శాఖ,శాస్త్రవేత్తలు సూచించే యాజమాన్య పద్ధతులను సకాలంలో అమలు చేయాలని వారు కోరారు. పరిస్థితిని బట్టి సాగు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అనవసర పెట్టుబడులు, పంట నష్టాన్ని కొంతమేర నివారించవచ్చని తెలిపారు.ఈ క్షేత్రస్థాయి పర్యటనలో మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్‌కుమార్‌, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

.

వరి విత్తనోత్పత్తిలో మెళకువలు పాటించాలి శాస్త్రవేత్తలు మదన్ మోహన్ రెడ్డి, గోన్యా నాయక్

ఎవుసం టీవీ, రేగొండ: నాణ్యమైన విత్తనోత్పత్తి ద్వారానే అధిక దిగుబడులు సాధించవచ్చని...

Related articles

వరి విత్తనోత్పత్తిలో మెళకువలు పాటించాలి శాస్త్రవేత్తలు మదన్ మోహన్ రెడ్డి, గోన్యా నాయక్

ఎవుసం టీవీ, రేగొండ: నాణ్యమైన విత్తనోత్పత్తి ద్వారానే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం భూపాలపల్లి కోఆర్డినేటర్ డా. కె. మదన్...

సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ రంగంపై కీలక చర్చలు

ఎవుసం టీవీ, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, డిజిటల్ వ్యవసాయం తదితర అంశాలపై...

పంటల్లో తెగుళ్ల నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఎవుసం టీవీ, చింతలమానేపల్లి (కొమురంభీం ఆసిఫాబాద్):చింతలమానేపల్లి మండలంలోని డబ్బా, ఆదేపల్లి, బాబాసాగర్ గ్రామాల్లో TRVK, KVK శాస్త్రవేత్తల బృందం మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆయా...

రబీ సాగుపై రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సూచనలు

ఎవుసం టీవీ, జమ్మికుంట: రబీ సీజన్‌లో రైతులు అనుసరించాల్సిన సాగు విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్...
App Icon

Install ETV News App

Add to home screen for faster loading and latest updates.