సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ రంగంపై కీలక చర్చలు

Date:

Share post:

ఎవుసం టీవీ, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, డిజిటల్ వ్యవసాయం తదితర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో ముందుకు సాగేందుకు సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్–2026 వేదికగా విస్తృత చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని హోటల్ ట్రైడెంట్‌లో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు కొనసాగుతోంది.కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సదస్సుకు హాజరై ప్రారంభోపన్యాసం అందించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సదస్సులో పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు మెరుగైన సేవలు అందించడం, కేంద్ర పథకాల అమలును సమర్థవంతంగా కొనసాగించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో విస్తృతంగా వినియోగించడం వంటి అంశాలపై సదస్సులో చర్చలు కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమం 100వ ఎపిసోడ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర APC, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, IAS సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు సమయానుకూలంగా వ్యవసాయ సమాచారం, సాంకేతిక సలహాలు, మార్గదర్శకాలు అందిస్తున్న తీరును వివరించారు.అనంతరం కేంద్ర ప్రయోజిత పథకాలు, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (DAM), రైతు రిజిస్ట్రీ, ఎరువుల నిర్వహణ, సహజ వ్యవసాయం, పప్పుధాన్యాలు, ఆయిల్‌పామ్, ఉద్యానవన రంగం తదితర అంశాలపై సమీక్ష, చర్చలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాల వారీగా వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, రైతులకు అందుతున్న సేవలు, ఎదురవుతున్న సవాళ్లపై కూడా సమావేశంలో చర్చిస్తున్నారు.వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రైతులకు ప్రభుత్వ పథకాలు, సాంకేతిక సేవలు సమర్థవంతంగా అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంపై సదస్సులో దృష్టి సారించారు.ఈ సదస్సులో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రులు రామ్ నాథ్ ఠాకూర్, భాగీరథ్ చౌదరీతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్–నికోబార్ దీవుల నుంచి వ్యవసాయ శాఖ మంత్రులు, కార్యదర్శులు, కమిషనర్లు, వ్యవసాయ సంచాలకులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి APC, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, వ్యవసాయ సంచాలకులు డా. బి. గోపి తదితరులు పాల్గొన్నారు.

పంటల్లో తెగుళ్ల నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఎవుసం టీవీ, చింతలమానేపల్లి (కొమురంభీం ఆసిఫాబాద్):చింతలమానేపల్లి మండలంలోని డబ్బా, ఆదేపల్లి, బాబాసాగర్...

Related articles

పంటల్లో తెగుళ్ల నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఎవుసం టీవీ, చింతలమానేపల్లి (కొమురంభీం ఆసిఫాబాద్):చింతలమానేపల్లి మండలంలోని డబ్బా, ఆదేపల్లి, బాబాసాగర్ గ్రామాల్లో TRVK, KVK శాస్త్రవేత్తల బృందం మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆయా...

రబీ సాగుపై రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సూచనలు

ఎవుసం టీవీ, జమ్మికుంట: రబీ సీజన్‌లో రైతులు అనుసరించాల్సిన సాగు విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్...

రసాయనాలకు దూరంగా.. ప్రకృతి సాగు బాటలో రైతులు

కోసిని గ్రామంలో కృషి సఖీల క్షేత్ర సందర్శన ఎవుసం టీవీ, కాగజ్‌నగర్: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు ప్రకృతి సాగు పద్ధతులపై అవగాహన కల్పించే...

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం

ఎవుసం టీవీ, రేగొండ: ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకునే మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేయాలని...
App Icon

Install ETV News App

Add to home screen for faster loading and latest updates.