ప్రకృతి వ్యవసాయంపై కృషి సఖీలకు 5 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభం

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఎవుసం టీవీ, జయశంకర్ భూపాలపల్లి: జాతీయ సమగ్ర ప్రకృతి వ్యవసాయ పథకం (NMNF – National Mission on Natural Farming) ఆధ్వర్యంలో కృషి సఖీలు మరియు క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లకు 5 రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జె. బాపు హాజరై మాట్లాడారు… రసాయన ఎరువులు, పురుగు మందుల విచ్చలవిడి వాడకం వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి జరిగే అనర్థాలను కృషి సఖీలకు తెలియజేశారు. అలాగే ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభసాటి మెళకువలు, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే విధానాలను వివరించారు. అనంతరం షార్ప్ ఎన్జీఓ జిల్లా నోడల్ ఆఫీసర్ ఎం. మణికుమార్ మాట్లాడుతూ.. రసాయనాల అవశేషాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల తలెత్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. మంచి ఆహారం ఉంటేనే మంచి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించబడుతుందని అన్నారు. వివిధ మండలాల నుండి హాజరైన కృషి సఖీలు క్షేత్ర స్థాయిలో ప్రతి రైతు వద్దకు వెళ్లి ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పించి, రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించేలా ప్రోత్సహించాలని, తద్వారా జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు సహకరించాలని జిల్లా వ్యవసాయ అధికారి సూచించారు.

వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు రెండు రోజులు సెలవు

ఎవుసం టీవీ, వరంగల్ (ఏనుమాముల సర్కిల్): వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి...

Related articles

వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు రెండు రోజులు సెలవు

ఎవుసం టీవీ, వరంగల్ (ఏనుమాముల సర్కిల్): వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి రెండు రోజులు సెలవు ప్రకటించినట్లు వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పులి...

రైతన్న చేతిలోకి RAISE యాప్ అస్త్రం.. ఫొటో తీస్తే చీడపీడల సమస్యకు పరిష్కారం!

ఎవుసం టీవీ జమ్మికుంట: ఆధునిక వరి సాగులో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు అందుబాటులోకి వచ్చిన రైస్ ఏఐ స్ట్రెస్...

పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తలు తప్పనిసరి : ఏఈఓ చిలువేరి ప్రవీణ్

ఎవుసం టీవీ,చందుర్తి: పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని చందుర్తి మండలం,మూడపల్లి క్లస్టర్ ఏఈఓ చిలువేరి ప్రవీణ్...

విత్తనోత్పత్తితో రైతులకు అదనపు లాభాలు : తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా. ఎం. మధు

      ఎవుసం టీవీ, కొమురం భీం ఆసిఫాబాద్: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు సాధ్యమని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా. ఎం. మధు...
App Icon

Install ETV News App

Add to home screen for faster loading and latest updates.