ఎల్‌నినో పరిస్థితుల్లో ఉద్యాన పంటల యాజమాన్యంపై రైతులకు శిక్షణ

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఎవుసం టీవీ, ఆత్మకూరు(హన్మకొండ): ఎల్‌నినో ప్రభావంతో రాబోయే కాలంలో వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యానవన,వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడు గ్రామంలో పరకాల డివిజన్ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గురువారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన అధికారి పి. కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతల వల్ల మామిడి, ఆయిల్‌ పామ్, అరటి, మిరప పంటలకు నష్టం జరగకుండా డ్రిప్, మల్చింగ్, సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. పరకాల డివిజన్ ఉద్యాన వన శాఖ అధికారి సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఎల్‌నినో సమయంలో ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించారు. ప్రతి రైతు తమ పొలంలో నీటి యాజమాన్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రభుత్వం అందిస్తున్న డ్రిప్ పరికరాల సబ్సిడీ, మల్చింగ్ షీట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయిల్‌పామ్ లో అంతర పంటలు వేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.జెవిఆర్ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. ఏ. ప్రశాంత్ మాట్లాడుతూ..* నేల పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువులు వాడాలని, నీటిని పొదుపుగా వాడాలని తెలిపారు.అనంతరం అధికారులు ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటలుగా సాగు చేస్తున్న లిల్లీ, అరటిని పరిశీలించి రైతులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో అక్కంపేట సర్పంచ్ ముద్దం సాంబయ్య, అగ్రంపహాడ్ సర్పంచ్ గంగుల మహేందర్, సీతారాంపూర్ సర్పంచ్ పెండ్లి రాజు, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవళిక, ఉద్యానశాఖ విస్తరణ అధికారి దేవేందర్, ఆయిల్‌పామ్ ఏరియా మేనేజర్ ప్రవీణ్ కుమార్, అరుణ్, రంజిత్, రైతులు పెండ్లి శంకర్, రాదరపు రాజు, యశాల రవీందర్, సంజీవ రెడ్డి, అనంత రెడ్డి, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నవంబర్ 6న వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో పంట ధరల వివరాలు

ఎవుసం టీవీ, ఏనుమాముల మార్కెట్ సర్కిల్: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు...

Related articles

నవంబర్ 6న వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో పంట ధరల వివరాలు

ఎవుసం టీవీ, ఏనుమాముల మార్కెట్ సర్కిల్: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు వరంగల్ లో శుక్రవారం (06-11-2026) రోజున మార్కెట్ కు సంబంధించిన పంటల...

రైతులను నూనెగింజల సాగు వైపు ప్రోత్సహిస్తున్న వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల

ఎవుసం టీవీ, తోర్నాల: పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తూ రైతులు ప్రత్యామ్నాయ లాభదాయక పంటల సాగు చేపట్టేలా వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల ఆధ్వర్యంలో ‘రైతు...

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ASCI ప్రతినిధులు.. రైతు మురళీధర్ సాగు విధానాలపై అధ్యయనం

    ఎవుసం టీవీ, ఎల్కతుర్తి: ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, సుస్థిర సాగు విధానాలపై క్షేత్రస్థాయి అవగాహన పొందేందుకు హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా...

రసాయనాలు తగ్గించి,భూసారాన్ని కాపాడుకోవాలి : ఏఈఓ ప్రవళిక

ఎవుసం టీవీ, ఆత్మకూర్ (హన్మకొండ) : నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, రసాయన ఎరువుల మోతాదును తగ్గించి దీర్ఘకాలిక స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారానే...
App Icon

Install ETV News App

Add to home screen for faster loading and latest updates.