ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ASCI ప్రతినిధులు.. రైతు మురళీధర్ సాగు విధానాలపై అధ్యయనం

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

 

ఎవుసం టీవీ, ఎల్కతుర్తి: ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, సుస్థిర సాగు విధానాలపై క్షేత్రస్థాయి అవగాహన పొందేందుకు హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) ప్రతినిధుల బృందం హన్మకొండ జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించింది.హన్మకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన రైతు కె. మురళీధర్ నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ప్రతినిధుల బృందం సందర్శించింది. ASCI సంస్థకు చెందిన ‘పీజీ డిప్లొమా ఇన్ సస్టైనబుల్ కలెక్టివ్స్ మేనేజ్‌మెంట్ – 2026’ కోర్సు విద్యార్థులు, అధ్యాపక బృందం ఈ పర్యటనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతు మురళీధర్ తన వ్యవసాయ క్షేత్రంలో అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రతినిధులకు వివరించారు. రసాయన ఎరువులు, పురుగుమందులకు దూరంగా ఉంటూ సహజ సిద్ధమైన పద్ధతుల్లో పంటలు సాగు చేస్తున్న విధానాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా జీవామృతం, ఘనజీవామృతం, వివిధ రకాల కషాయాల తయారీ, వినియోగ పద్ధతులతో పాటు అంతర పంటల సాగు విధానాలను మురళీధర్ వివరించారు. సహజ వనరులను వినియోగించుకుంటూ సాగు ఖర్చులను తగ్గించడం, నేల సారాన్ని కాపాడటం, నాణ్యమైన దిగుబడులు సాధించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సుస్థిర యాజమాన్య పద్ధతులపై అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు ఈ క్షేత్ర పర్యటన ప్రత్యక్ష అనుభవాన్ని అందించింది. ప్రకృతి వ్యవసాయ విధానాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో, వాటి ద్వారా పర్యావరణ పరిరక్షణకు, భూసార సంరక్షణకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకునే అవకాశం లభించింది. ఈ సందర్భంగా ASCI ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం పర్యావరణ పరిరక్షణతో పాటు నేల ఆరోగ్యం, మానవ ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తుందని అభిప్రాయపడ్డారు. తమకు వ్యవసాయ పద్ధతులను వివరంగా తెలియజేసిన రైతు కె. మురళీధర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరణలో అమలు చేస్తూ, ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్న రైతు మురళీధర్ క్షేత్రం విద్యార్థులకు సుస్థిర వ్యవసాయంపై ఒక ప్రత్యక్ష అధ్యయన వేదికగా నిలిచింది.

నవంబర్ 6న వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో పంట ధరల వివరాలు

ఎవుసం టీవీ, ఏనుమాముల మార్కెట్ సర్కిల్: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు...

Related articles

నవంబర్ 6న వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో పంట ధరల వివరాలు

ఎవుసం టీవీ, ఏనుమాముల మార్కెట్ సర్కిల్: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు వరంగల్ లో శుక్రవారం (06-11-2026) రోజున మార్కెట్ కు సంబంధించిన పంటల...

రైతులను నూనెగింజల సాగు వైపు ప్రోత్సహిస్తున్న వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల

ఎవుసం టీవీ, తోర్నాల: పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తూ రైతులు ప్రత్యామ్నాయ లాభదాయక పంటల సాగు చేపట్టేలా వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల ఆధ్వర్యంలో ‘రైతు...

రసాయనాలు తగ్గించి,భూసారాన్ని కాపాడుకోవాలి : ఏఈఓ ప్రవళిక

ఎవుసం టీవీ, ఆత్మకూర్ (హన్మకొండ) : నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, రసాయన ఎరువుల మోతాదును తగ్గించి దీర్ఘకాలిక స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారానే...

ఎల్‌నినో పరిస్థితుల్లో ఉద్యాన పంటల యాజమాన్యంపై రైతులకు శిక్షణ

ఎవుసం టీవీ, ఆత్మకూరు(హన్మకొండ): ఎల్‌నినో ప్రభావంతో రాబోయే కాలంలో వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు...
App Icon

Install ETV News App

Add to home screen for faster loading and latest updates.